News May 13, 2024
అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల!

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిసి కనిపిస్తుంటే హైదరాబాద్‌లో బోసిపోయి కనిపిస్తున్నాయి. ఓటర్ల కోసం పోలింగ్ సిబ్బంది సైతం వేచిచూస్తున్నారు. చాలా మంది సెటిలర్లకు ఏపీలోనూ ఓటు హక్కు ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్లంతా సొంతూళ్లకు తరలివెళ్లారు. దీంతో దాదాపు 20 శాతం ఓటింగ్ తగ్గేలా కనిపిస్తోంది.
Similar News
News December 17, 2025
డిసెంబర్ 17: చరిత్రలో ఈరోజు

* 1903: రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది
* 1914: క్రికెట్ లెజెండ్ సయ్యద్ ముస్తాక్ అలీ జననం
* 1959: నటి జయసుధ జననం
* 1959: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం
* 1985: నటుడు అడివి శేష్ జననం
* 1996: సినీ నటి సూర్యకాంతం మరణం(ఫొటోలో)
News December 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 17, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.03 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


