News August 11, 2025
గాజా విషయంలో మరో ఆప్షన్ లేదు: నెతన్యాహు

గాజాలో మొదలు పెట్టింది పూర్తి చేయడం తప్ప మరో మార్గంలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ‘హమాస్ చర్యలతోనే గాజాలో మరణాలు, వినాశనం జరుగుతోంది. గాజాను ఆక్రమించడం కాదు.. దానికి విముక్తి కలిగించడమే మా లక్ష్యం. ఆ ప్రాంతాన్ని సైనికరహితంగా మార్చడం, అక్కడి భద్రతా బాధ్యతలు ఇజ్రాయెల్ సైన్యం తీసుకోవడమే మా ఉద్దేశం’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 10, 2026
మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.
News March 10, 2026
ఇతిహాసాల నుంచి నానుడిలు: ‘గొంతెమ్మ కోరికలు’ అంటే ఏమిటి?

అడగకూడని, అసంబద్ధమైన కోరికలనే ‘గొంతెమ్మ కోరికలు’ అంటారు. భారతంలో కుంతీ దేవి పేరే గొంతెమ్మగా మారింది. ఆమె కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఇచ్చిన వరాన్ని పరీక్షించడం కోసం సూర్యుడిని వేడుకోగా కర్ణుడిని పుత్రుడిగా ప్రసాదిస్తారు. దీంతో ఆమె భయంతో బిడ్డను నదిలో వదిలేస్తారు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ‘కర్ణుడు పాండవుల పక్షాన రావాలి’ అంటూ సాధ్యం కాని కోరికను శ్రీకృష్ణుడిని కోరతారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 10, 2026
AIతో అమ్మాయిల లవ్.. ఆందోళనలో చైనా?

చైనాలో యువతులు ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ‘AI బాయ్‌ఫ్రెండ్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక ఒత్తిళ్లు, పెళ్లి పట్ల విరక్తితో కోట్లాది మంది ఈ వర్చువల్ తోడును ఎంచుకోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో పడిపోతున్న జననాల రేటును మరింత తగ్గిస్తుందని చైనా భావిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు తెచ్చింది. చాట్‌బాట్‌ల వాడకంపై టైమ్ లిమిట్, సోషల్ వాల్యూస్ బ్రేక్‌పై నిఘా పెంచింది.


