News August 7, 2024
మన రెజ్లర్లపై కుట్ర జరిగింది: విజేందర్ సింగ్
వినేశ్ ఫొగట్ అనర్హత వెనుక కచ్చితంగా ఏదో కుట్ర ఉందని ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ 100 గ్రాముల్ని తగ్గించుకునేందుకు ఒలింపిక్ కమిటీ అవకాశం ఇచ్చి ఉండాలన్నారు. ‘ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. భారత రెజ్లర్లపై ఏదో కుట్ర జరుగుతోంది. బహుశా కొంతమంది మన సంతోషాన్ని చూడలేకపోతున్నారేమో! ఒక రాత్రిలోనే ఐదారు కిలోలు తగ్గుతుంటాం. 100 గ్రాములకు సమస్యేముంది?’ అని పేర్కొన్నారు.
Similar News
News September 10, 2024
ఉచిత బస్సుతో అద్భుత ఫలితాలు.. సీఎంతో అధికారులు
TG: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉచిత బస్సు స్కీం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని అధికారులు సమీక్షలో సీఎంకు చెప్పారు. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా ప్రయాణికులకు రూ.2,840 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి HYDలోని ఆస్పత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగిందని వివరించారు.
News September 10, 2024
త్వరలోనే ఆపరేషన్ బుడమేరు.. కబ్జా చేస్తే శిక్ష: CM
గత ఐదేళ్లలో బుడమేరు వాగుపై అక్రమ కట్టడాలు కట్టారని, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని.. ఒకానొక దశలో అది పూడుకుపోయే దశకు చేరిందని CM చంద్రబాబు తెలిపారు. చెత్తాచెదారం తీయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంగా మారాయని, గట్లను పట్టించుకోకపోవడం వల్ల 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయని విమర్శించారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేసి, కబ్జా చేసినట్లు తేలితే శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు.
News September 10, 2024
లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా? జాగ్రత్తలివే!
* ఆ యాప్ RBIలో రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేయాలి. అవ్వకపోతే రుణం తీసుకోవద్దు.
* ప్లే స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్స్ ఉన్నాయని లోన్ తీసుకోవద్దు. ఎందుకంటే లక్షకుపైగా డౌన్ లోడ్స్ ఉన్న చాలా ఇల్లీగల్ యాప్స్‌ను గూగుల్ ఇప్పటికే తొలగించింది.
* కస్టమర్ కేర్ సపోర్ట్ ఉందా? ఆయా నంబర్లు పనిచేస్తున్నాయా? స్పందన ఎలా ఉందనేది నిర్ధారించుకోవాలి.
* డబ్బు తిరిగి చెల్లించినా కూడా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.