News April 30, 2024

ఎక్కువ ఐసీసీ టోర్నీలు ఆడిన IND ప్లేయర్స్ వీరే!

image

జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు ఐసీసీ లిమిటెడ్ ఓవర్ల టోర్నీ(ODI WC, T20 WC, ఛాంపియన్స్ ట్రోఫీ)ల్లో ఇండియా తరఫున అత్యధికంగా ధోనీ, యువరాజ్ 14 సార్లు భాగస్వామ్యమయ్యారు. వచ్చే టోర్నీతో రోహిత్ కూడా 14 సార్లు పాల్గొన్న ప్లేయర్‌గా ఘనత సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ(13), సచిన్(11), హర్భజన్(11) ఉంటారు.

Similar News

News December 14, 2025

వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

News December 14, 2025

పసుపులో దుంపకుళ్లు తెగులు – నివారణ

image

నీరు నిలిచే, తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు పంటకు దుంపకుళ్లు ముప్పు ఎక్కువ. దీని వల్ల కాండంపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దుంప చూస్తే వేర్లు కుళ్లి నల్లగా మారి, లోపల చిన్న పురుగులు ఉండి, దుర్వాసన వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 100kgల వేపపిండి వేయాలి. తల్లి పురుగుల కట్టడికి 3g కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 10kgలు వేయాలి. కుళ్లినచోట లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపిన ద్రావణం పోయాలి.

News December 14, 2025

మలయాళ నటుడు ఆత్మహత్య!

image

మలయాళ నటుడు అఖిల్ విశ్వనాథ్(30) మృతి చెందారు. తల్లి చూసేసరికి అఖిల్ ఇంట్లో శవమై కనిపించారు. అతను ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలున్నాయి. అఖిల్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘చోలా’ చిత్రానికి 2019లో కేరళ స్టేట్ అవార్డ్ లభించింది. అతను మొబైల్ షాపులో మెకానిక్‌గా చేస్తున్నారని, కొన్నాళ్లుగా ఆ పనికీ వెళ్లట్లేదని తెలుస్తోంది. బైక్ ప్రమాదంలో గాయపడిన అఖిల్ తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.