News August 24, 2024

మన శరీరంలోని త్రివిధ దోషాలు ఇవే

image

పాంచభౌతికమైన మానవ శరీరంలో వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలు ఆరోగ్యానికి కీలకమని ఆయుర్వేదం చెబుతోంది. గాలితో ముడిపడిన వాతం, శరీర కదలికల్ని నియంత్రిస్తుంది. ఇక అగ్నితో ముడిపడిన పిత్తం, పొట్ట పైభాగంలో ఉండి జీర్ణవ్యవస్థను నడిపిస్తుంది. నీరు, భూమి సంబంధితమై ఛాతీలో ఉండే కఫం రోగ నిరోధక శక్తి విషయంలో కీలకమవుతుంది. ఈ మూడు సమతుల్యంగా ఉంటే ఆరోగ్యమని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

Similar News

News January 15, 2026

సంక్రాంతి అల్లుడికి 158 రకాల వంటకాలతో విందు

image

AP: గోదావరి జిల్లాలను మరిపించేలా ఈసారి తెనాలి వాసులు అల్లుడికి 158 రకాల వంటకాలతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. తెనాలికి చెందిన మురళీకృష్ణ తన కుమార్తె మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు చేశారు. రకరకాల పిండి వంటలు, ఫలహారాలు, పండ్లతో భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు.

News January 15, 2026

తగ్గిన బంగారం ధర.. మరోసారి పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 తగ్గి రూ.1,43,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 తగ్గి రూ.1,31,250గా ఉంది. మరోవైపు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న కేజీపై రూ.15,000 పెరగగా, ఈరోజు రూ.3,000 పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో 18,000 ఎగబాకి రూ.3,10,000 చేరింది.

News January 15, 2026

బాలింతలు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా?

image

పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా లేదా అనేది వారి ఆరోగ్యస్థితిపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే పిల్లల వయసు, ఆరోగ్యం, తల్లికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాస్తారు. పాలద్వారా యాంటీబయాటిక్స్ తక్కువ మొత్తంలోనే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అయినా ఇలాంటి మందులేవైనా వాడేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోనే వాటిని వాడాలని సూచిస్తున్నారు.