News April 2, 2024
వాళ్లు అసలు మనుషులే కాదు: వాట్సన్

ఐపీఎల్‌లో అదరగొడుతున్న రిషభ్ పంత్ ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్. పంత్ నుంచి కూడా ప్రేరణ పొందనివారు అసలు మనుషులే కాదని అభిప్రాయపడ్డారు. ‘ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషభ్ తిరిగి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం నమ్మశక్యంగా లేదు. దారిలో పడేందుకు కొంచెం సమయం తీసుకున్నారు కానీ సెట్ అయ్యాక తనదైన స్టైల్‌లో అద్భుతమైన షాట్లు ఆడారు’ అని వాట్సన్ పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘నటరాజ’’

శివుడు సమస్త కళలకు, నాట్యానికి అధిపతి. ఆయన చేసే తాండవం సృష్టి గమనాన్ని సూచిస్తుంది. శివుడు ‘ఆనంద తాండవం’ చేస్తున్నప్పుడు సృష్టి నిర్మాణం జరుగుతుందని, ‘రుద్ర తాండవం’ చేసినప్పుడు దుష్టశిక్షణ జరుగుతుందని చెబుతారు. ప్రపంచంలోని అణువణువూ ఆయన చలనం (నాట్యం) వల్లే కదులుతోందని కొందరు శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. నాట్య కళ ద్వారా విశ్వ రహస్యాలను వెల్లడించే ఈ సార్వభౌముడిని ‘నటరాజు’గా మనం కొలుచుకుంటాం.
News February 12, 2026
మహిళల్లో అధిక మూత్ర విసర్జనకు కారణాలివే..

వయసు తక్కువగా ఉన్నా కూడా అతిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారణమంటున్నారు నిపుణులు. పెల్విక్ నొప్పి, పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువగా అవడం, మెనోపాజ్ వల్ల ఇలా జరుగుతుందంటున్నారు. అలాగే మూత్రం ఆపుకోలేకపోవడానికి పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం, కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివి కారణం. దీన్ని నివారించడానికి కెగెల్ వ్యాయామాలు ఉపయోగపడతాయంటున్నారు.
News February 12, 2026
పంచాయతీలకు మరో రూ.387 కోట్లు

TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇటీవల రూ.259 కోట్లు <<19056099>>విడుదల<<>> చేసిన 15వ ఆర్థిక సంఘం తాజాగా మరో రూ.387 కోట్లను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం రూ.646 కోట్లను ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఇంకా రూ.2,400 కోట్ల నిధులు పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.


