News April 1, 2024

ఏప్రిల్ 2 నుంచి ఈ గూగుల్ యాప్ బంద్

image

గూగుల్ పాడ్‌కాస్ట్‌ యాప్ ఏప్రిల్ 2 నుంచి పని చేయదు. ఈ నేపథ్యంలో యూజర్లు తమ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఈ పాడ్‌కాస్ట్ తరహా సేవలు యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో అందించనుంది. పాడ్‌కాస్ట్ డేటా యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే.. పాడ్‌కాస్ట్‌ యాప్‌లో ఎక్స్‌పోర్ట్స్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ యూట్యూబ్ మ్యూజిక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Similar News

News February 13, 2026

జగిత్యాలలో జీవన్‌రెడ్డి అనుచరుల హవా!

image

TG: INCలో వివాదంగా మారిన జగిత్యాల మున్సి‘పోల్స్’లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అనుచరులు రెబల్స్‌గా పోటీచేసిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 50 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. BRS MLA సంజయ్ అనుచరులకు పార్టీ టిక్కెట్లు దక్కడంతో జీవన్ రెడ్డి అనుచరులు 14 చోట్ల పోటీచేశారు. వాటన్నిటిలోనూ విజయం సాధించారు. ఇక ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో INC 12, BJP 4, BRS 4, MIM 2 వార్డులను దక్కించుకున్నాయి.

News February 13, 2026

కోళ్లలో కొక్కెర వ్యాధిని ఇలా గుర్తించండి

image

కొక్కెర వ్యాధి సోకిన కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గి, శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లు బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3-4 రోజుల్లో మరణిస్తాయి.

News February 13, 2026

image

https://d29i5havsxvi1j.cloudfront.net/elecresult/election-result-2024.html?lang_id=1&states=Telagana%20Muncipal%20Election%20Results,Telangana%20Corporation%20Election%20Results