News October 6, 2025

ఇది దేశ చరిత్రలో చీకటి రోజు: సీఎం రేవంత్

image

సుప్రీంకోర్టులో CJI గవాయ్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘ఇది దేశ చరిత్రలో చీకటి రోజు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయలేవని CJI ధైర్యంగా ప్రకటించారు’ అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘CJIపై దాడికి యత్నం సిగ్గుచేటు. ఇది మన న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన దాడి. జుడీషియరీ సేఫ్టీ, సెక్యూరిటీ ఎంతో ముఖ్యం’ అని ఖర్గే అన్నారు.

Similar News

News January 14, 2026

ఇందిరమ్మ పథకం.. ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి వారం బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత వారానికి రూ.152.40 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 13,861 మంది ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని, మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపింది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని సూచించింది.

News January 14, 2026

గంజితో ఎన్నో లాభాలు

image

అన్నం వండిన తర్వాత వచ్చే గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గంజిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. గంజిని ఒక మెత్తని వస్త్రం లేదా దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన పదినిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.

News January 14, 2026

ముగ్గుల్లో వైద్య, కంప్యూటర్ శాస్త్రాల మేళవింపు

image

ముగ్గులలో వైద్యశాస్త్ర సంకేతాలు ఉన్నాయట. కిందికి, పైకి ఉండే త్రిభుజాలు స్త్రీ, పురుష తత్వాలను సూచిస్తాయట. వీటి కలయికతో ఏర్పడే 6 కోణాల నక్షత్రం సృష్టికి సంకేతం. ఆధునిక కాలంలో కంప్యూటర్ ఆల్గారిథమ్స్ రూపొందించడానికి, క్లిష్టమైన ప్రోటీన్ నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి కూడా ముగ్గులు తోడ్పడుతున్నాయట. గణితం, మానవ శాస్త్రం కలగలిసిన అద్భుత కళాఖండం ఈ రంగవల్లిక. ఇది మన సంస్కృతిలోని విజ్ఞానానికి నిదర్శనం.