News May 1, 2024
T20 WCకు ఆస్ట్రేలియా టీమ్ ఇదే

టీ 20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. IPL సంచలనం ఫ్రేజర్ మెక్‌గుర్క్‌కు జట్టులో చోటు దక్కలేదు. జట్టు: మిచెల్ మార్ష్ (C), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్, స్టొయినిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అస్టన్ అగర్, ఆడమ్ జంపా, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్.
Similar News
News December 9, 2025
నేడు పార్లమెంటులో SIRపై చర్చ

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ నిర్వహిస్తోన్న SIRపై ఇవాళ లోక్‌సభలో 10 గంటలపాటు చర్చ జరగనుంది. 12PMకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారు. సభ్యుల ప్రసంగాల తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సమాధానం ఇస్తారు. కాగా ఓట్ల చోరీ, ఎన్నికల కమిషన్ విధానాలు, BLOల ఆత్మహత్యలపై రాహుల్ ప్రశ్నించే అవకాశం ఉంది. సమగ్ర చర్చకు తాము సిద్ధమేనని ఎన్డీఏ కూడా చెబుతోంది.
News December 9, 2025
మచ్చలు పడుతున్నాయా?

చాలామంది మహిళలు తప్పు సైజు, నాణ్యత తక్కువగా ఉన్న లోదుస్తులను వాడతారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు. * స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి మర్దనా చేయాలి. * పాలు, బాదం నూనెలను కలిపి మచ్చలున్న ప్రాంతాల్లో రాయాలి. * పెరుగులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న దగ్గర రాస్తే మార్పు కనిపిస్తుంది.
News December 9, 2025
ఆర్థిక సమస్యలను తొలగించే ‘ద్వార లక్ష్మీ పూజ’

ఇంటి గడపను లక్ష్మీ ద్వారంగా భావించి, దేవతలను ఆహ్వానించడానికి పసుపు, కుంకుమలతో అలంకరిస్తాం. అయితే 16 రోజులు ‘ద్వార లక్ష్మీ పూజ’ ఆచరిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు, జాతక దోషంతో బాధపడుతున్నవారు ఈ పూజ చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మీ ద్వార పూజ ఎప్పుడు, ఎలా చేయాలి? పూజా ఫలితాలు తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


