News April 30, 2024

T20 WCకు ఇంగ్లండ్ జట్టు ఇదే

image

T20 WC కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఈసీబీ ఖరారు చేసింది. ఈ జట్టులో జాసన్ రాయ్, టామ్ కరన్, మలన్, వోక్స్ వంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కలేదు. జట్టు: జోస్ బట్లర్(C), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, హార్ట్‌లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్, రీస్ టాప్లే, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

Similar News

News December 16, 2025

మంగళవారం ఈ పనులు చేయకూడదట..

image

హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఈ రోజు కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కటింగ్, షేవింగ్, గోర్లు కత్తిరించడం వంటివి చేయరాదు. చేస్తే ఆయుష్షు తగ్గుతుంది. అలాగే, అంగారక ప్రభావం వల్ల కొత్త బట్టలు కొనడం, ధరించడం, కొత్త బూట్లు వేసుకోవడం మంచిది కాదు. మసాజ్ చేయించుకోవడం కూడా ఆరోగ్య సమస్యలకు, ఇంట్లో తగాదాలకు దారితీయవచ్చు’ అంటున్నారు.

News December 16, 2025

త్రివిక్రమ్.. కెరీర్‌లో తొలిసారి!

image

త్రివిక్రమ్ తన జోనర్ మార్చినట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సరదా సినిమాలతో సందడి చేసే ఆయన కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్‌ కథను ఎంచుకున్నారని చెబుతున్నాయి. వెంకటేశ్‌-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ అనే మూవీ పట్టాలెక్కగా ఇటీవల పోస్టర్ సైతం విడుదలైంది. ఈ చిత్రం క్యాప్షన్ AK47 ఫాంట్ స్టైల్ రక్తపు మరకలతో ఉండటం చూస్తే థ్రిల్లర్‌ మూవీగా స్పష్టమవుతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News December 16, 2025

AP-RCET ఫలితాలు విడుదల

image

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.