News February 5, 2025
ఇదేం ప్రశ్న: రోహిత్ అసహనం

ENGతో వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఓ ప్రశ్నకు రోహిత్ అసహనం వ్యక్తం చేశారు. CT తర్వాత హిట్‌మ్యాన్ రిటైర్ అవుతారనే వార్తలు రాగా ‘మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?’ అని మీడియా ప్రశ్నించింది. ‘ఇదేం ప్రశ్న. త్వరలో వన్డే సిరీస్, CT జరగనున్నాయి. ప్రస్తుతం అవే నాకు ముఖ్యం. ఈ టైంలో నా భవిష్యత్తు గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం. ఏవో వార్తల గురించి మాట్లాడటానికి నేను లేను’ అని రోహిత్ అన్నారు.
Similar News
News January 17, 2026
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,43,780కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,31,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.3,10,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి
News January 17, 2026
స్త్రీ ద్వేషులకు ప్రజలు బుద్ధి చెప్పారు: కంగనా

BMC <<18877157>>ఎన్నికల్లో<<>> మహాయుతి కూటమి గెలుపుపై నటి, MP కంగనా సంతోషం వ్యక్తం చేశారు. శివసేన(ఉద్ధవ్ వర్గం)కి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ‘స్త్రీ ద్వేషులు, బెదిరింపు రాజకీయాలు చేసేవాళ్లు, నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టారు. నా ఇంటిని అక్రమంగా కూల్చి మహారాష్ట్రను వదిలిపొమ్మని బెదిరించారు. ఇప్పుడు వాళ్లనే జనం వదిలేశారు’ అని పేర్కొన్నారు. 2020లో ఉద్ధవ్ హయాంలో అధికారులు కంగనా ఇంటిని కూల్చారు.
News January 17, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌లోని <


