News March 19, 2024
ఈ ఆలయం విడాకులకు ప్రసిద్ధి

జపాన్‌లోని ఓ ఆలయం విడాకులకు ప్రసిద్ధి చెందింది. భాగస్వామితో విడిపోవాలని అనుకుంటున్నప్పుడు క్యోటో నగరంలోని ‘యాసుయ్ కొంపిరగు’ అనే దేవాలయంలో మొక్కితే మన కోరిక నెరవేరుతుందట. డివోర్స్ వరకే కాదండోయ్.. వ్యాపార బంధాలు ముగించాలన్నా, ఉన్న ఉద్యోగంలో నుంచి సామరస్యంగా బయటకి పోవాలన్నా, మనకున్న శత్రుత్వ బంధాలకు స్నేహపూర్వకంగా పులిస్టాప్ పడాలన్నా ఆ దేవాలయంలో ప్రార్థనలు చేస్తే చాలని అక్కడి భక్తులు నమ్ముతున్నారు.
Similar News
News December 14, 2025
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.
News December 14, 2025
CM చంద్రబాబుపై MLA చంద్రశేఖర్ సెటైర్లు

CM చంద్రబాబుపై YCP MLA చంద్రశేఖర్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘వరుస ఓటములతో ఇక ఫుట్‌బాల్ ఆడనన్నాడు. నేను దావోస్ వెళ్లినప్పుడు అర్జెంటీనా నుంచి వచ్చి కలిశాడు. ఆటలో చిట్కాలు చెప్పా. ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు మెస్సీ. HYD వస్తారా, నన్నే అమరావతి రమ్మంటారా అని ఫోన్లు. వీలైతే ఈసారి విశాఖలో లోకేశ్ టీమ్, నీ టీమ్‌కూ మ్యాచ్ పెడదామన్నాను, ఆనందపడ్డాడు. మీకు ఎవరైనా గుర్తొస్తే నాకు సంబంధం లేదు!’ అని ట్వీట్ చేశారు.
News December 14, 2025
IPL మినీ ఆక్షన్.. ఈ ప్లేయర్‌కే అత్యధిక ధర?

ఎల్లుండి జరిగే IPL మినీ ఆక్షన్‌లో AUS ఆల్‌రౌండర్ గ్రీన్ అత్యధిక ధర పలకొచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా. ఈ వేలానికి ఆయన బ్యాటర్‌గా రిజిస్టర్ చేసుకోగా, మొదటి సెట్‌లోనే ఎక్కువ ప్రైస్ రావాలని అలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తన మేనేజర్ పొరపాటున ఆప్షన్ తప్పుగా పెట్టాడని, తాను బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ తెలిపారు. అత్యధిక పర్స్ ఉన్న (₹64.30Cr) KKR ఆయన్ను కొనే ఛాన్సుంది.


