News March 31, 2024

ఈ పదేళ్ల పాలన ట్రైలర్ మాత్రమే: మోదీ

image

పదేళ్ల బీజేపీ పాలన ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. అసలు అభివృద్ధి ముందుందని చెప్పారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించే రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. లోక్‌సభ ఎన్నికలు ‘వికసిత్ భారత్’ నిర్మాణం కోసం జరుగుతున్నవని చెప్పారు.

Similar News

News February 18, 2026

సోనియా నన్ను CM చేయాలనుకున్నారు.. కానీ: హిమంత

image

2014లో తనను అస్సాం CM చేయాలని నాటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అనుకున్నారని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. కానీ రాహుల్ వల్ల మొత్తం మారిపోయిందన్నారు. ‘తేదీ నిర్ణయించుకోమని మేడమ్(సోనియా) చెప్పారు. జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తానన్నా. USలో ఉన్న రాహుల్ పార్టీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పరిస్థితి మారిపోయింది’ అని ఆరోపించారు. 2015 ఆగస్టులో కాంగ్రెస్ నుంచి BJPలోకి ఆయన చేరారు. 2021లో CM అయ్యారు.

News February 18, 2026

ఇండియా Vs సౌతాఫ్రికా.. అన్నదమ్ముల పోరు!

image

T20 WC <<19168527>>సూపర్-8<<>>లో భాగంగా ఈనెల 22న ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ 2 జట్లకు అన్నదమ్ములు కోచింగ్ స్టాఫ్‌గా ఉండటం గమనార్హం. SAకు అల్బీ మోర్కెల్ కన్సల్టింగ్ కోచ్‌గా, INDకు బౌలింగ్‌ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ వ్యవహరిస్తున్నారు. ‘ఈ మ్యాచ్ విషయంలో మా ఇద్దరి కంటే అమ్మ ఎక్కువగా ఆందోళన చెందుతోందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే IND, SAలో ఎవరికి మద్దతివ్వాలో ఆమెకు తెలియట్లేదు’ అని అల్బీ చెప్పారు.

News February 18, 2026

హెయిర్ వాష్ 2 సార్లు చేసుకోవాలా?

image

తల స్నానం చేసినప్పుడు డబుల్ వాష్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘మొదటి వాష్‌తో మురికి, ఆయిల్, చెమట, కాలుష్యంతో పేరుకుపోయిన పదార్థాలు, చుండ్రు తొలగిపోతాయి. రెండో వాష్‌తో షాంపూ మరింత ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. తల శుభ్రంగా ఉండటంతో అందులోని ప్రోటీన్లు నేరుగా చొచ్చుకెళ్తాయి. తల చర్మం, జుట్టు మరింత దృఢంగా మారుతాయి‘ అని అంటున్నారు.