News March 13, 2025
మతం మారమని బలవంతం చేసేవారు: డానిష్ కనేరియా

మైనారిటీలపై వివక్ష కారణంగానే తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నారు. పాక్ తరఫున ఆడుతున్న సమయంలో మిగిళిన వాళ్లతొ సమానంగా విలువదక్కేది కాదని, ఆప్రీది,షోయబ్ అక్తర్ తరచుగా మతం మారమని బలవంతం చేసేవారని తెలిపారు. ఇంజమామ్ మాత్రం తనకు మద్దతుగా ఉండేవారన్నారు. ఆ కారణంగానే USAలో స్థిరపడాల్సి వచ్చిందన్నారు. పాక్ తరఫున ఆడిన హిందు క్రికెటర్లలో డానిష్ కనేరియా 2వ వారు.
Similar News
News February 18, 2026
AIతో కొత్త మతాలు.. మిషనరీలు: హరారీ

దావోస్‌లో నిఖిల్ కామత్‌తో జరిగిన చర్చలో ప్రముఖ చరిత్రకారుడు యువల్ నోవా హరారీ మతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో AI కొత్త మతాలను సృష్టించడమే కాకుండా, సొంత మిషనరీలను కూడా కలిగి ఉండొచ్చని అంచనా వేశారు. మతగ్రంథాల సారాంశాన్ని విశ్లేషించడంలో మనుషుల కంటే AI మెరుగ్గా ఉంటుందని తెలిపారు. భక్తుల ప్రశ్నలకు నేరుగా సమాధానమిస్తుందని పేర్కొన్నారు.
News February 18, 2026
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్

T20WC: అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ స్థానంలో సుందర్, కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు.
IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య (C), హార్దిక్ పాండ్య, దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
News February 18, 2026
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 24 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech/MCA, MBA, BSc/BCom/BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.tcil.net.in


