News July 6, 2024
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్ట్

TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి అనే ముగ్గురిని మంగళగిరి పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 2021 అక్టోబర్ 19న ఈ ఘటన జరగగా, ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరింది. ఇటీవల 4 పోలీస్ బృందాలు విచారణ జరిపి నిందితులను గుర్తించాయి. వారిలో గుంటూరుకు చెందిన YCP కార్యకర్తలే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించాయి. కాగా పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 10, 2025
కేతకీ పుష్పాన్ని పూజలో ఎందుకు వినియోగించరు?

శివ పూజలో కేతకీ పుష్పం వాడరన్న విషయం తెలిసిందే! శివుని జ్యోతిస్తంభం ఆది, అంతాలను కనుగొన్నానని బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఈ పుష్పాన్నే సాక్ష్యంగా చూపాడట. అది అబద్ధపు సాక్ష్యమని గ్రహించిన శివుడు తన పూజలో ఈ పుష్పాన్ని వాడొద్దని శపించాడు. అందుకే శివపూజలో మొగలి పువ్వును వాడరు. అయినప్పటికీ శివ భక్తులు దీనిని తలలో ధరించవచ్చని, పూజా ప్రాంగణంలో అలంకారం కోసం ఉపయోగించవచ్చని పురోహితులు సూచిస్తున్నారు.
News December 10, 2025
శరీరంలో ఈ మార్పులు వస్తే జాగ్రత్త!

చాలా మంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లేదా రాత్రి వేళల్లో అతి మూత్రం, మూత్రంలో నురుగు/ఎర్రటి రంగు, ముఖం/పాదాలు లేదా శరీరం ఉబ్బినట్లు అనిపిస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. బీపీ పెరుగుతున్నా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలని చెబుతున్నారు.
News December 10, 2025
నాగార్జున సాగర్@70ఏళ్లు

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.


