News November 19, 2025
TMC విశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

టాటా మెమోరియల్ సెంటర్(TMC) హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (విశాఖ)లో 15 కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎండీ, డీఎన్‌బీ, డీఎంతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in/
Similar News
News January 23, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.
News January 23, 2026
పీవీ సింధుపై సీఎంల ప్రశంసలు

ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 23, 2026
రేపటి నుంచి రష్యా-ఉక్రెయిన్-అమెరికా కీలక చర్చలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా తొలి అడుగుగా UAEలో రేపటి నుంచి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. జనవరి 23, 24 తేదీల్లో ఉక్రెయిన్, అమెరికా, రష్యా ప్రతినిధులు చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దావోస్‌లో ప్రకటించారు. ఇది మొదటి త్రైపాక్షిక భేటీ కావడం విశేషం. US అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. రష్యా కూడా రాజీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.


