News November 19, 2025

TMC విశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

టాటా మెమోరియల్ సెంటర్‌(TMC) హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (విశాఖ)‌లో 15 కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎండీ, డీఎన్‌బీ, డీఎంతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in/

Similar News

News January 17, 2026

సంక్రాంతి 3 కాదు, 4 రోజుల పండుగ

image

సంక్రాంతి అంటే అందరూ మూడ్రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి, తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత. పశుపక్షాదులను, ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకునే ఈ ముక్కనుమతోనే సంక్రాంతి సంబరాలు సంపూర్ణమవుతాయి.

News January 17, 2026

అధిక ఆదాయాన్నిచ్చే హైబ్రిడ్ కొబ్బరి రకాలు

image

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.

News January 17, 2026

మరో రెండు అమృత్ భారత్ ట్రైన్లు

image

TG: తెలుగు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో 2 కొత్త రైళ్లను కేటాయించింది. చర్లపల్లి-నాగర్‌కోయల్, నాంపల్లి-తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న PM మోదీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరిగింది.