News April 27, 2024

గుర్తుండిపోవాలని

image

AP: జనసేన అభిమాని గాజు గ్లాసుపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు పార్టీ సింబల్ బాగా గుర్తుండేలా పెద్ద సైజు గ్లాసుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పెద్ద గ్లాసును భుజానికి వేసుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆ యువకుడు కనిపించారు. జనసేన గుర్తు ఇదేనంటూ ప్రజలకు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి తరఫున జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.

Similar News

News April 14, 2026

గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

image

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.

News April 14, 2026

అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

image

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.

News April 14, 2026

ఆ విషయంలో వైభవ్ హ్యాపీగా లేడు: అసిస్టెంట్ కోచ్

image

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడంపై RR అసిస్టెంట్ కోచ్ ట్రెవోర్ పెన్నీ స్పందించారు. ‘ఫెరీరా గాయంతో బాధపడుతుండటంతో ప్రారంభ మ్యాచుల్లో సూర్యవంశీని పూర్తిగా ఆడించాం. ఫెరీరా కోలుకోవడంతో జట్టులోకి తీసుకున్నాం. అందుకే వైభవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు పంపుతున్నాం. అంతేతప్ప ఫీల్డింగ్ చేయట్లేదని కూర్చోపెట్టడం లేదు. ఈ విషయంలో అతడు సంతోషంగా లేడు’ అని తెలిపారు.