News April 27, 2024

పెద్దపల్లి ఓటర్లు ‘పెద్దరికం’ కట్టబెట్టేదెవరికో?

image

TG: పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో ఈసారి కొప్పుల ఈశ్వర్(BRS), గడ్డం వంశీకృష్ణ(INC), గోమాస శ్రీనివాస్(BJP) బరిలో దిగుతున్నారు. ఇక్కడ 9సార్లు కాంగ్రెస్, 3సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్ గెలిచాయి. హ్యాట్రిక్ కోసం BRS, మళ్లీ పట్టు సాధించాలని INC, బోణీ కొట్టాలని BJP ఆరాటపడుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ స్థానం పరిధిలో ఉన్న 7 సీట్లనూ INC కైవసం చేసుకుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News April 13, 2026

ఆంధ్రా కశ్మీర్ అనంత.. మనదగ్గరా యాపిల్ పంట

image

AP: ఎక్కువగా చల్లని ప్రదేశాల్లోనే పండే యాపిల్ పంట ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. అనంతపురం(D) గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో రైతులు సాగు చేస్తున్నారు. 15 ఎకరాల్లో తోటలు వేశారు. డిసెంబర్‌లో పూతకు వచ్చిన చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకొచ్చాయి. ఎకరానికి టన్ను దిగుబడి వచ్చిందని, కిలో ₹120-170 పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ‘అనంత యాపిల్’ పేరుతో గిఫ్ట్ ప్యాకులుగానూ విక్రయిస్తున్నారు.

News April 13, 2026

ఇంటర్ ఫలితాలు.. 1000కి 997 మార్కులు

image

TGలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. MPCలో సాయి శ్రేష్ఠిత 1000కి 997, BiPCలో కె.జ్యోత్స్న, హఫ్సాబేగం 1000కి 997 చొప్పున స్కోర్ చేశారు. ఇక ఫస్టియర్‌ MPCలో పలువురు విద్యార్థులు 470కి 469 మార్కులు సాధించారు. నేటి నుంచి ఈ నెల 20వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్‌కు రూ.800 చొప్పున చెల్లించాలి.

News April 13, 2026

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

image

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.