News March 31, 2024

TODAY HEADLINES

image

*TG: కరెంట్ కోతలు, తాగునీటి సమస్యలు ఉండొద్దు: రేవంత్
*TG: KTRపై క్రిమినల్ కేసు నమోదు
*AP: మంచి పాలన అందించడానికి తోడుగా ఉండండి: జగన్
*AP: కమల్ హాసన్‌ను మించిన నటుడు జగన్: చంద్రబాబు
*AP: నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి: పవన్
*AP: వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు
*AP: ప్రతి మహిళకు నెలకు రూ.8,500: షర్మిల
*IPL: పంజాబ్‌పై లక్నో విజయం

Similar News

News February 19, 2026

చిన్న వయసులోనే తల నెరుస్తోందా?

image

చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే తల నెరుస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, రసాయనాలున్న, సింథటిక్‌ షాంపూలు వాడటం దీనికి కారణం అంటున్నారు నిపుణులు. గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్‌, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

News February 19, 2026

TG EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4 వరకు <>https://eapcet.tgche.ac.in/<<>>లో అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకునేందుకు మే 2 వరకు అవకాశం ఉంది. ఈసారి కొత్తగా మొబైల్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. కాగా మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ పరీక్షలు, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.

News February 19, 2026

రేపు యశ్ ‘టాక్సిక్’ టీజర్

image

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రేపు ఉదయం 9.35 గంటలకు టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలో నటించారు. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న విడుదలవనుంది.