News March 31, 2024
స్కాలర్‌షిప్ దరఖాస్తుకు నేడు చివరి తేదీ

TG: SC, ST, BC, PWD విద్యార్థుల ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 5-10 తరగతులు చదువుతోన్న వారు 2024-25 విద్యాసంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినందున మరో ఛాన్స్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. స్కాలర్‌షిప్ రెన్యువల్ చేసుకోవాల్సిన వారికీ ఇదే చివరి అవకాశం.
రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వెబ్‌సైట్: https://telanganaepass.cgg.gov.in/
Similar News
News February 17, 2026
భారత్‌తో ఓటమి.. నఖ్వీ కోపానికి పాక్ కోచ్ బలి?

టీమ్‌ఇండియా చేతిలో ఓటమి తర్వాత పాక్ కోచ్ మైక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొలంబోలోని ప్రసిద్ధ ‘క్రికెట్ క్లబ్ కేఫ్’లో ఆయన కనిపించిన దృశ్యాలు SMలో వైరలవుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌పై PCB ఛైర్మన్ నఖ్వీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రేపు నమీబియాతో మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే ఆ జట్టు ఇంటికెళ్లాల్సిందే. ఈ తరుణంలో కేఫ్‌లో మైక్ కనిపించడం చర్చకు దారితీసింది.
News February 17, 2026
బంగ్లా ప్రధానిగా తారిఖ్ ప్రమాణం.. భేటీ అయిన ఓం బిర్లా

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ ఢాకాలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు తారిఖ్‌తో బిర్లా ప్రత్యేకంగా సమావేశమై భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 297 సీట్లకు గాను ఆ పార్టీ 209 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే.
News February 17, 2026
రూ.10 కోట్లు చెల్లించాల్సిందే.. విశాల్‌కు కోర్టు ఆదేశం

ప్రముఖ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లైకా ప్రొడక్షన్స్‌కు వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇందుకు ఆరు వారాల సమయం కావాలంటూ హీరో మరో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టేసింది. గడువు ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా సినిమా తీస్తానని విశాల్ తమ వద్ద రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదంటూ లైకా 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.


