News September 12, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్: సీఎం రేవంత్
* నేపాల్ నుంచి స్వస్థలాలకు చేరుకున్న ఏపీ వాసులు
* ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
* కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు: సజ్జల
* ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు
* గ్రూప్-1పై జుడీషియల్ కమిషన్ వేయాలి: కేటీఆర్

Similar News

News December 7, 2025

KMR: ఆ మండలాల్లో ప్రచార పర్వానికి 3 రోజులే!

image

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 3రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 9 సాయంత్రం 5గం.లోపు బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారాన్ని ముగించాల్సిందే. భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో 167 గ్రామ పంచాయతీలకు గాను 11 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 156 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.

News December 7, 2025

మీ తోబుట్టువును గౌరవిస్తున్నారా?

image

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బానధవా|
తం తు దేశం న పశ్యామి యత్ర బాత్రా సహోదరా||
సహోదరుల బంధం గురించి రాముడు పలికిన మాటలివి. ఈ బంధం విశ్వంలో ఎక్కడా దొరకనంత అమూల్యమైనదని దీనర్థం. సోదరులతో చిన్న మనస్పర్ధలు వచ్చినా, సరిచేసుకుని కలిసి ఉండాలి. ఎక్కడికెళ్లినా భార్యలు, బంధువులు దొరుకుతారు కానీ, తోబుట్టువు దొరకరు. అందుకే ఈ బంధాన్ని దేంతో పోల్చలేము. అంత అపురూపమైనది. ఈ బంధాన్ని ఎల్లప్పుడూ గౌరవించుకోవాలి.

News December 7, 2025

బేబీ గ్రోత్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

image

తల్లి గర్భంలో పిండం ఎదుగుదల తెలుసుకోవడానికి ముందు వయసు సరిగా నిర్ధారించుకోవాలి. మూడు నెలలకు ఓసారి స్కాన్‌ చేయించాలి. తల్లి అధిక బరువు ఉన్నా, బరువు తక్కువగా ఉన్నా..35 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల పిండం బరువు పెరగక పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిండం ఎదగనప్పుడు కొన్ని సమస్యలు కనిపిస్తాయి. తల్లి కడుపు నుంచి రక్తం ఆగి ఆగి వెళ్లడంగానీ వెనక్కి వచ్చినా పిండం కడుపులోనే చనిపోవచ్చు.