News May 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 15, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:26 గంటలకు
సూర్యోదయం: ఉదయం గం.5:44 గంటలకు
జొహర్: మధ్యాహ్నం గం.12:12 గంటలకు
అసర్: సాయంత్రం గం.4:43 గంటలకు
మఘ్రిబ్: రాత్రి గం.6:41 గంటలకు
ఇష: రాత్రి గం.08.00 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News December 10, 2025

రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM

image

AP: ఆధునిక సాగు యంత్రాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంకు ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వాణిజ్య పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. ‘శాస్త్రీయ విధానంలో సాగు ప్రణాళిక, ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగంతో ఖర్చు తగ్గించాలి. ఓ వెబ్‌సైట్ ప్రారంభించి పరికరాల వివరాలు తెలియజేయాలి. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కపాస్ కిసాన్ యాప్‌లోని సమస్యలను CCI అధికారులు పరిష్కరించాలి’ అని ఆదేశించారు.

News December 10, 2025

క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

image

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.

News December 10, 2025

ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

image

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.