News May 13, 2024
నేడే పోలింగ్.. పోటెత్తండి.. ఓటేయండి!

AP: నేడే పోలింగ్. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం రానిచోట ఎండ కూడా దంచికొట్టొచ్చు. ఎండైనా, వానైనా.. చివరికి తుఫాను వచ్చినా మీ హక్కును వినియోగించుకోవడం మానొద్దు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీరు స్వయంగా పాలుపంచుకునే బాధ్యతను మరువొద్దు. ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని మిస్ చేయొద్దు. మరచిపోకండి. పోలింగ్‌కు పోటెత్తండి. ఓటేయండి!
Similar News
News December 17, 2025
హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం.. అయితే!

AP: రాష్ట్రంలోని హజ్ యాత్రికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి రూ.లక్ష అందించనున్నట్లు తెలిపింది. అయితే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్లే వారికే ఈ సాయం అందుతుందని చెప్పింది. ఆదాయంతో సంబంధం లేకుండా విజయవాడ నుంచి వెళ్లేవారికి రూ.లక్ష అందజేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు మైనార్టీ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
News December 17, 2025
బుధ ప్రదోష పూజా విధానం

ప్రదోష పూజను సాయంత్రం చేయాలి. అప్పటి వరకు ఉపవాసం ఉండాలి. ప్రదోష వేళలో పూజా గదిలో శివలింగాన్ని లేదా శివపార్వతుల చిత్రపటాన్ని పూజించాలి. శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, పూలు, పండ్లు సమర్పించడం తప్పనిసరి. ప్రశాంత మనస్సుతో ‘ఓం నమః శివాయ’ అని జపించాలి. శివ అష్టోత్తరం చదివి, హారతి ఇచ్చి, నైవేద్యం పంచి ఉపవాసం విరమించాలి. బుధ ప్రదోషం బుద్ధి, వ్యాపారంలో విజయాన్నిస్తుంది.
News December 17, 2025
సన్‌రైజర్స్.. ఈసారి 300 పక్కానా!

IPLలో విధ్వంసకర జట్టుగా పేరొందిన SRH మరింత బలంగా మారింది. నిన్నటి మినీ వేలంలో హిట్టర్లు లివింగ్‌స్టోన్, కార్స్, జాక్ ఎడ్వర్డ్స్‌ను కొనుగోలు చేసింది. ఇప్పటికే అభిషేక్, హెడ్, క్లాసెన్, ఇషాన్‌తో టాప్ ఆర్డర్ శత్రుదుర్భేద్యంగా ఉంది. లివింగ్‌స్టోన్, కార్స్, ఎడ్వర్డ్స్, నితీశ్ రెడ్డితో మిడిల్ ఆర్డర్ పటిష్ఠమైంది. దీంతో గత IPLలో మిస్సైన 300 స్కోర్ ఈసారి పక్కా అని SRH ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


