News September 12, 2025
భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు

AP: రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా కిలో రూ.2కి పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో కూలీ ఖర్చులు కూడా రావట్లేదని వాపోయారు.
Similar News
News December 16, 2025
ఇప్పటివరకు IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

*రూ.27 కోట్లు- రిషభ్ పంత్ (లక్నో)
*రూ.26.75 కోట్లు- శ్రేయస్ అయ్యర్ (పంజాబ్)
*రూ.25.20 కోట్లు- గ్రీన్ (కేకేఆర్)
*రూ.24.75 కోట్లు- స్టార్క్ (కేకేఆర్)
*రూ.23.75 కోట్లు- వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
*రూ.20.50 కోట్లు- కమిన్స్ (SRH) *రూ.18.50 కోట్లు- సామ్ కరన్ (పంజాబ్) *రూ.18 కోట్లు- పతిరణ (కేకేఆర్), అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), చాహల్ (పంజాబ్)
News December 16, 2025
42% రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క

TG: బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ల సాధన టార్గెట్‌గా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో 2 విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు.
News December 16, 2025
ఇంటర్నెట్ కింగ్ ‘Chrome’.. మార్కెట్‌లో 70% వాటా!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ క్రోమ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతోంది. ‘STAT COUNTER’ విడుదల చేసిన NOV-2025 డేటా ప్రకారం.. 70% కంటే ఎక్కువ మంది యూజర్లు క్రోమ్‌నే వాడుతున్నారు. దీని తర్వాత సఫారీ(14.35%), EDGE(4.98%), ఫైర్‌ఫాక్స్(2.3%), ఒపెరా(1.89%), శామ్‌సంగ్ ఇంటర్నెట్(1.86%), మిగిలినవి(3.4%) ఉన్నాయి. మీరు ఏ బ్రౌజర్ ఎక్కువగా వాడతారు? COMMENT


