News March 19, 2024
రేపు నూతన గవర్నర్ బాధ్యతల స్వీకరణ

TG: రాష్ట్ర నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. దీంతో ఇవాళ రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళిసై రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.
Similar News
News December 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 12, 2025
ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వకపోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.
News December 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 12, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


