News March 26, 2024
గ్రూప్-1 దరఖాస్తుల్లో ఎడిట్‌కు రేపే లాస్ట్ డేట్

TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకోవడానికి రేపు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. గ్రూప్-1కు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయి.
వెబ్‌సైట్: <
Similar News
News February 19, 2026
608 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (<
News February 19, 2026
సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్.. కారణాలివే

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటివి సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు పతనమై 82,974 వద్ద, నిఫ్టీ 211 క్షీణించి 25,607 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, TCS షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. KWIL, ట్రెంట్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News February 19, 2026
ప్రతి జిల్లా కాంప్లెక్స్‌లో తెలంగాణ తల్లి విగ్రహం

TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సుల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 33 జిల్లా కేంద్ర కార్యాలయ భవనాల కాంప్లెక్సుల్లో వీటి ఏర్పాటుకు రూ.5.80 కోట్ల విడుదలకు పాలనా అనుమతి జారీచేసింది.


