News March 17, 2024

గాజువాకలో అమర్నాథ్‌‌కు టఫ్ టైమ్?

image

AP: YCP జాబితాలో ఉత్తరాంధ్రలో పెద్దగా మార్పులు లేవు. కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు మాత్రం స్థానచలనం తప్పలేదు. అతడిని గాజువాక MLAఅభ్యర్థిగా ప్రకటించింది. విజయం కోసం అతడు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ TDP అభ్యర్థి పల్లా వాసుపై సానుభూతి ఉందని.. BJP, JSP వైపు నుంచి మద్దతు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో గుడివాడకు అక్కడ టఫ్ టైమ్ నడుస్తున్నట్లు చెబుతున్నారు.

Similar News

News October 11, 2024

తల్లి లేదు.. రాదు.. పాపం ఆ పిల్లలకు అది తెలియదు!

image

ఆ తల్లి కుక్క ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దానికి పాలు తాగే నాలుగు పిల్లలున్నాయి. తమ తల్లి ప్రాణాలతో లేదన్న విషయం అన్నెం పున్నెం తెలియని ఆ పిల్లలకు తెలిసే దారేది? అప్పటి వరకూ ఆడుకుని అలసిపోయి వచ్చాయి. అమ్మ లేస్తుందని, పాలిస్తుందని చూశాయి. ఎంతసేపటికీ తల్లి లేవకపోవడంతో దీనంగా దాని చెంతనే నిద్రపోయాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం చూపరులను కదిలించింది.

News October 11, 2024

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: లోకేశ్

image

AP: పంటలు పండని అనంతపురంలో కార్లు పరిగెత్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళగిరిలో కియా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడిన్ ఆంధ్రా అంటున్నారు. CBN విజన్ ఉన్న నాయకుడు. TCSను ఒప్పించి పెట్టుబడులు తేవడమే కాదు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చిన్న పరిశ్రమలనూ ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.

News October 11, 2024

ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం

image

ముల్తాన్‌ టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాభవంపాలైంది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 556 పరుగులు చేశాక కూడా ప్రత్యర్థి చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇలా ఓడిన తొలిజట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను 823-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 220కే ఆలౌటైంది. లీచ్ 4 వికెట్లు పడగొట్టారు.