News August 23, 2025

TPT: దరఖాస్తులకు నేడు చివరి తేదీ

image

తిరుపతి SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల డి.ఫార్మసీ (Diploma in Pharmacy) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు శనివారంతో ముగుస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 13, 2026

మాల్తుమ్మెద ఉద్యాన వనక్షేత్రంలో అగ్నిప్రమాదం

image

నాగిరెడ్డిపేట్(M) మాల్తుమ్మెదలోని ఉద్యాన వనక్షేత్రంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో పూతతో ఉన్న మామిడి, జామ చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్షేత్ర సిబ్బంది వెంటనే ఎల్లారెడ్డి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక టీమ్ చర్యలు చేపట్టింది. ఇలాంటి ప్రమాదాలు అడవుల్లో తరచూ జరుగుతూ పోతున్నాయి. 

News January 13, 2026

ములుగు: ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం సందేశం

image

జిల్లాలోని ఉచిత ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం పంపించిన నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షల సందేశం లేఖను విద్యుత్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు. ములుగు జిల్లాలో 40,585 గృహ, 25,427 వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని వారందరికీ ప్రభుత్వ సందేశాన్ని చేరవేస్తున్నామని ఎస్ఈ ఆనందం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగేశ్వర్ రావు, అధికారులు పాల్గొన్నారు.

News January 13, 2026

పరకాల: బీజేపీలో బహిర్గతమైన అంతర్గత విభేదాలు!

image

సోమవారం పరకాల పట్టణంలో జరిగిన బీజేపీ మున్సిపల్ సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతుండగానే బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, బూతులు తిట్టుకోవడంతో సమావేశం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది. పరకాల పట్టణానికి చెందిన ఓ నాయకుడి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్న వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. పార్టీ శ్రేణులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.