News May 12, 2024

TPT: దూరవిద్య పీజీ ఫలితాల విడుదల

image

తిరుపతి : శ్రీవేంకటేశ్వర దూరవిద్య (DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ ఎంబీఏ (MBA) మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News December 15, 2025

చిత్తూరులో పెరిగిన కోడిగుడ్ల ధర

image

చిత్తూరు జిల్లాలో కోడి గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో డజన్ రూ.84లకే లభించేవి. ప్రస్తుతం రూ.96కు చేరుకుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉత్పత్తిదారులు తెలుపుతున్నారు. అంగన్వాడీ, పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేవారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. కోళ్ల పెంపకం తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని, జనవరి అనంతరం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

News December 15, 2025

చిత్తూరు జిల్లాలో ఘోరం..!

image

చిత్తూరు మండలం తుమ్మిందకు చెందిన బాబు ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్. అతని భార్య కవిత ఆ బస్సులోనే హెల్పర్‌గా పనిచేస్తున్నారు. కవితకు ఇటీవల రూపేశ్ అనే వ్యక్తి పరిచయం కావడంతో బంగారు నగలు ఇచ్చింది. వాటిని అతను తిరిగి ఇవ్వలేనని చెప్పాడు. నగల విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కవిత తన కుమారుడు ముఖేష్(4)తో కలిసి గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

News December 14, 2025

కుప్పం: పేలిన నాటు బాంబు.. పరిస్థితి విషమం

image

కుప్పం (M) కొట్టాలూరు పంచాయతీ ఎర్రమన్ను గుంతలు సమీపంలో నాటు బాంబు పేలి చిన్న చిన్న తంబి (38) తీవ్రంగా గాయపడ్డాడు. చిన్న తంబి శరీరం ఓవైపు పూర్తిగా కాలిపోవడంతో అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. చిన్న తంబి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కుప్పం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.