News May 15, 2024

TPT: పోలీసుల పని తీరుపై విమర్శలు

image

తిరుపతి పద్మావతి వర్శిటీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘర్షణలను అదుపు చేయటంలో పోలీసులు సకాలంలో స్పందించలేదని విమర్శలున్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు తిష్ఠవేసిన స్ట్రాంగ్ రూముకు కిమీ దూరంలో మధ్యాహ్నం 4.30 గంటలకు ఘర్షణ ప్రారంభమైంది. సాయంత్రం 6.30 గంటల వరకు అదే పరిస్థితి కొనసాగింది. అదనపు బలగాలు వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Similar News

News December 12, 2025

చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

image

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్‌ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.

News December 12, 2025

ఫోన్ నంబర్ల బోర్డులు పెట్టండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ప్రదేశాల్లో ఆసుపత్రులు, డాక్టర్ల ఫోను నెంబర్ల వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ హైవేల్లో చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

News December 12, 2025

పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

image

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.