News November 8, 2025

Tragedy: ఉప్పల్‌లో కానిస్టేబుల్ సూసైడ్

image

ఉప్పల్‌లో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మల్లికార్జుననగర్‌లో నివాసం ఉంటోన్న శ్రీకాంత్(42) 2009 బ్యాచ్‌కు చెందిన PC. ఫిలింనగర్‌ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అక్టోబర్ 23 నుంచి విధులకు కూడా హాజరుకానట్లు తెలుస్తోంది. శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆర్థిక సమస్యలే సూసైడ్‌కు కారణమని సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News January 24, 2026

HYD: రేపు లుంబినీ పార్కు వద్ద సందడి!

image

హైదరాబాద్‌ గగనతలం దేశభక్తి గీతాలతో ప్రతిధ్వనించనుంది. గణతంత్ర వేడుకలు, వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టిలరీ సెంటర్ ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు లుంబినీ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద భారీ ‘మిలిటరీ బ్యాండ్’ ప్రదర్శన జరగనుంది. సైనికుల క్రమశిక్షణ, సంగీత విన్యాసాల కలబోతగా సాగే ఈ వేడుక నగరవాసులకు కనువిందు చేయనుంది.

News January 24, 2026

​నాంపల్లి అగ్నిప్రమాదం: ప్రాణాలకు తెగించి వెళ్లినా.. తిరిగిరాని ముగ్గురు!

image

నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. లోపల ఉన్న వారిని కాపాడేందుకు మేనేజర్ మహమ్మద్ హుస్సేన్, ఇంతియాజ్‌తో పాటు మరొక వ్యక్తి సాహసించి లోపలికి వెళ్లారు. దురదృష్టవశాత్తు వారు తిరిగి రాలేదు. బాధితుల్లో 60 ఏళ్ల వృద్ధురాలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ, మంటల మధ్య వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

News January 24, 2026

HYD: TDR కావాలా.. ఇవి తెలుసుకోండి!

image

మీ భూమి చెరువుల పరిధిలో ఉంటే లేదా రోడ్డు వెడల్పులో పోతే ప్రభుత్వానికి అప్పగించి TDR పొందవచ్చు. నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తున్నారు. టైటిల్ వివాదాలున్నా TDR బ్యాంక్‌లో మీ వాటా భద్రంగా ఉంటుంది. ఇప్పటివరకు GHMCలో దాదాపు 1070 ఎకరాలకు పైగా TDR ఇచ్చారు. అందులో చాలా వరకు వాడగా ఇంకా 316 ఎకరాల TDR అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ద్వారా మీరు కూడా మీకు కావాల్సిన వారితో బేరం కుదుర్చుకుని వీటిని అమ్ముకోవచ్చు.