News March 28, 2024

ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు శిక్షణ

image

TG: రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 3 నెలల పాటు ట్రైనింగ్, 45 రోజుల ఫీల్డ్ శిక్షణ ఉంటుందని చెప్పారు. మొత్తం 614 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 555 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. వీరికి ఫిబ్రవరి 14న నియామక ఉత్తర్వులు ఇవ్వగా, ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) 3 జాయింట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతతో పాటు 15ఏళ్ల అనుభవం గలవారు మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 65ఏళ్లు. నెలకు రూ.1,75,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nhai.gov.in/

News February 12, 2026

నేటి అసెంబ్లీ షెడ్యూల్

image

AP: ఇవాళ అసెంబ్లీ ఉ.9 గం.కు ప్రారంభం కానుంది. 10 గం. వరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. సభ నడిచే 17 రోజుల్లో రోజుకు 10 ప్రశ్నలు మాత్రమే అనుమతిస్తారు. అనంతరం ప్రభుత్వం 8 సవరణ ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, దానిపై చర్చలు జరగనున్నాయి. ఎల్లుండి (ఫిబ్రవరి 14) మంత్రి పయ్యావుల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

News February 12, 2026

స్కూళ్లకు బంద్ లేనట్లే..!

image

భారత్ <<19115946>>బంద్<<>> ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లపై అంతగా లేనట్లు తెలుస్తోంది. ఇవాళ స్కూల్‌కు సెలవు అని మెసేజులు రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు ఈ బంద్‌లో పాల్గొనట్లేదు కాబట్టి అంతరాయం కలిగించే అవకాశాలు లేవు. బ్యాంకులు, రవాణా, ప్రభుత్వ కార్యాలయాలపై బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇవాళ స్కూళ్లకు హాలిడే అని మీకేమైనా మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.