News April 30, 2024

జడ్జి బదిలీ.. మళ్లీ మొదటి నుంచి సీఎం జగన్ కేసుల విచారణ

image

AP: సీబీఐ కోర్టులో CM జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు ఇచ్చేందుకు హైకోర్టు నేటి వరకు గడువు ఇచ్చింది. ఈ సమయంలో జడ్జి రమేశ్ బాబు బదిలీ అయ్యారు. ఈయన 2022 మే నెల నుంచి 130 డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు వింటున్నారు. అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్లు అన్నింటిపై కొత్త జడ్జి మొదటి నుంచి వాదనలు విననున్నారు.

Similar News

News December 12, 2025

కలిసొచ్చిన నిబంధన తొలగింపు.. సర్పంచ్‌గా గెలుపు

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడం పలువురికి కలిసొచ్చింది. గతంలో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ఆ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో జనగామ(D) కొత్తపల్లి సర్పంచ్‌గా ముక్కెర స్వరూప రవికుమార్ ఎన్నికయ్యారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.

News December 12, 2025

AP న్యూస్ రౌండప్

image

* నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ACB కోర్టు ఈ నెల 15న తీర్పు ఇవ్వనుంది.
* చంద్రబాబుపై ఫైబర్‌నెట్ కేసును మూసేయడాన్ని సవాల్ చేస్తూ YCP నేత గౌతమ్ రెడ్డి వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని ACB కోర్టు వెల్లడించింది.
* నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణపై పోలీసులు PD యాక్ట్ నమోదు చేశారు.
* ఈ నెల 10న ఒక్కరోజే 1,46,607 టన్నుల ధాన్యం కొనుగోలుతో రికార్డు సృష్టించాం: మంత్రి నాదెండ్ల

News December 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 94

image

ఈరోజు ప్రశ్న: పైన చిత్రంలో ఉన్న మహాభారత పాత్ర ఎవరిది? ఆయనను ఎవరు చంపారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>