News April 27, 2024

1,500 బస్సుల కొనుగోలుకు TSRTC ఓకే

image

TG: మహాలక్ష్మి స్కీమ్ అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. కొన్నిసార్లు సీట్ల కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 1,500 ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక జులై నాటికి 450 ఎలక్ట్రిక్ బస్సులనూ అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 18, 2026

B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

image

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్‌ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

News April 18, 2026

టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

image

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

News April 18, 2026

గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

image

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.