News April 29, 2024
TTC ఉత్తీర్ణులైన వారికి గుడ్ న్యూస్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో TTC(టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు) లోయర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి మే 1 నుంచి జూన్ 13 వరకు శిక్షణ ఉంటుందని తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, HYD,హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, ఈ జిల్లాలో MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News April 18, 2026
జడ్చర్ల: సురేశ్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

MBNR: అక్కడ.. 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్‌పేట 43.6, దేవరకద్ర 43.1, కోయిలకొండ మండలం పారుపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.9, మేడ్చల్ మండలం దోనూరు కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 42.5, అడ్డాకుల 42.4, మహమ్మదాబాద్ 42.3, MBNR (U/R) 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.