News October 5, 2025

TTDలో త్వరలో కీలక మార్పులు..!

image

TTD ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టిన నెల రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు, భక్తుల నుంచి వినిపిస్తున్న మాట. చిన్నపొరపాటు కూడా లేకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. ఈక్రమంలోనే త్వరలో మరికొన్ని మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. బోర్డు మీటింగ్‌లో వీటిని వెల్లడించే అవకాశం ఉంది. తిరుమలలో ఏం మార్చాలో మీరు కామెంట్ చేయండి.

Similar News

News January 13, 2026

భారత్‌కు మరో S-400.. వచ్చేది ఎప్పుడంటే?

image

భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి నాలుగో S-400 క్షిపణి వ్యవస్థ ఈ ఏడాది మే నాటికి భారత్‌కు అందనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2018లో కుదిరిన రూ.40 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 5 వ్యవస్థలు కొనుగోలు చేయగా, ఇప్పటికే 3 భారత్‌కు చేరాయి. నాలుగోది ఈ ఏడాది మేలో, చివరిది 2027లో డెలివరీ కానుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400లు అద్భుతంగా పని చేసిన విషయం తెలిసిందే.

News January 13, 2026

కొండాపూర్: ‘వేసవికి తగ్గట్టుగా బీరు ఉత్పత్తి చేపట్టండి’

image

కొండాపూర్ మండలం మల్లేపల్లి బీరు, మద్యం తయారీ కంపెనీలను ఎక్సైజ్ సెక్రెటరీ రఘునందన్ రావు, కమిషనర్ సి.హరికిరణ్ సోమవారం పరిశీలించారు. వేసవి అవసరాలకు తగ్గట్టుగా బీర్ కంపెనీలు తమ ఉత్పత్తులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. బీర్ తయారీ విధానాన్ని పరిశీలించి పాటించావాల్సిన ప్రమాణాలు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

News January 13, 2026

ఐఫోన్ యూజర్లకు అలర్ట్

image

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్‌డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్‌డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్‌ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.