News December 9, 2025
TTD: మెరుగైన సేవలకు అభిప్రాయ సేకరణ

AP: మరింత మెరుగైన సేవల కోసం భక్తుల నుంచి TTD అభిప్రాయాలు సేకరిస్తోంది. IVRS ద్వారా వసతి, అన్నప్రసాదం సహా 17అంశాలపై సమాచారం తీసుకుంటోంది. తిరుమల, తిరుపతిలో పెట్టిన QR కోడ్లను స్కాన్ చేస్తే వచ్చే వాట్సాప్ నంబర్ 93993 99399లోనూ టెక్స్ట్/వీడియో ద్వారా భక్తుల నుంచి సమాచారం తెలుసుకుంటోంది. ప్రతినెల తొలి శుక్రవారం 0877-2263261 నుంచి డయల్ యువర్ EO ద్వారా సమస్యలు వింటూ సేవా నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తోంది.
Similar News
News December 9, 2025
గజగజ.. రేపు కూడా చలి తీవ్రత

తెలంగాణలో చలి వణికిస్తోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్‌లో టెంపరేచర్ 6-8 డిగ్రీలకు పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను బయటికి తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు.
News December 9, 2025
‘తెలంగాణ విజన్ -2047’ డాక్యుమెంట్.. కీలక అంశాలు

⋆ 2047 నాటికి $3T ఆర్థిక వ్యవస్థే ప్రధాన లక్ష్యం
⋆ 10 కీలక వ్యూహాలతో డాక్యుమెంట్, సమతుల్య అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజన (CURE, PURE, RARE)
⋆ పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులు. కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధానాల రూపకల్పన వంటివి ఇందులో ఉన్నాయి. పూర్తి డాక్యుమెంట్ కోసం ఇక్కడ <
News December 9, 2025
ఇదీ సంగతి: ఫోన్‌పే కొట్టు.. ఓటు పట్టు!

TG: రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలకు ప్రచారం ముగియడంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రలోభాలకు తెరలేపారు. గ్రామంలో ఉన్న ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతుండగా వలస ఓట్లపైనా దృష్టి పెట్టారు. వారికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తప్పకుండా తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఫోన్‌పే, గూగుల్ పే వంటి UPI పేమెంట్స్ ద్వారా డబ్బులు పంపుతున్నారు. ఓటుకు రేట్ కట్టడంతో పాటు రానుపోను దారి ఖర్చులకు ‘Pay’ చేస్తున్నారు.


