News November 20, 2025
TU: డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. 10838 విద్యార్థుల హాజరు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఉమ్మడి నిజామాబాద్ పరిధిలో గురువారం తొలి రోజు డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు 30 పరీక్ష కేంద్రాలలో 11519 మంది విద్యార్థులకు గాను 10838 మంది విద్యార్థులు హాజరు కాగా 681 మంది గైర్హాజరయ్యారు. ఉదయం డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ పరీక్షలు జరుగగా మధ్యాహ్నం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయని వెల్లడించారు.
Similar News
News January 20, 2026
ప.గో: తల్లి చేసిన తప్పు.. పిల్లాడి ప్రాణం తీసిన కూల్ డ్రింక్!

భీమవరంలో తల్లి చేసిన తప్పు ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. భర్తపై అలిగిన లక్ష్మి అనే మహిళ కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని కొంచెం తాగి నిద్రపోయింది. లక్ష్మి కుమారుడు మహా రుద్ర కాంత్ మిగిలిన కూల్ డ్రింక్ తాగేశాడు. అస్వస్థతకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News January 20, 2026
చిత్తూరు; స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం

చౌడేపల్లి (M) కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలకు ఉదయం ఆవరణంలోకి వచ్చి ముగ్గు వేసి, నిమ్మకాయలు కోసి, అక్షింతలు వేసి తాంత్రిక పూజలు చేసినట్లు సీసీ కెమెరాలులో నమోదయ్యాయి. ఈ ఘటన చూసిన ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 20, 2026
విజయవాడ: పది రోజుల్లో అదిరిపోయే ఆదాయం!

సంక్రాంతి సందర్భంగా విజయవాడ బస్టాండ్ నుంచి 547 అదనపు సర్వీసులతోపాటు, ఆర్టీసీ లోకల్ సర్వీసుల ఏర్పాటుతో గణనీయంగా ఆదాయం రాబట్టుకుంది. ఈ నెల 8 నుంచి 19 వరకు రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.70-80 లక్షలు రాగా.. ఈ ఏడాది పెరిగింది. మచిలీపట్నం కేంద్రం పరిధిలో మరో రూ. 30-50 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కలిపి రూ.1.50 కోట్లకు పైగా పది రోజుల్లోనే ఆదాయం రావడం విశేషం.


