News December 3, 2025
TU: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. 6462 హాజరు

తెలంగాణ యూనివర్సిటీ లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలకు 6840 మంది విద్యార్థులకు గాను 6462 మంది హాజరు కాగా 378 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్,6వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు 30 పరీక్షా కేంద్రాల్లో ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు.
Similar News
News February 17, 2026
సుల్తానాబాద్ మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియ ముగిసినా, సుల్తానాబాద్‌లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. 15 వార్డులకు గాను కాంగ్రెస్ 12 చోట్ల విజయం సాధించగా, అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలకపోవడంతో ఎన్నికను ఈరోజుకి వాయిదా వేశారు. ఛైర్మన్ రేసులో బిరుదు రాధాకృష్ణ, అంతటి పుష్పలత, గాజుల రాజమల్లు, భాకం కిరణ్ యాదవ్‌ల పేర్లు వినిపిస్తుండగా, పీఠం ఎవరిని వరిస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News February 17, 2026
నెల్లూరులో 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు DMHO 15 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ), DMLT, BSc MLT, LLB, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపటి వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
News February 17, 2026
పుంగనూరు: బైక్‌ను ఢీకొని చెరువులో దూసుకెళ్లిన ఆటో

పుంగనూరు మండలం గడ్డురుచెరువు వద్ద పుంగనూరు వైపు వెళ్తున్న బైక్‌ని గొల్లపల్లి వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో గొర్రెల వాలెప్ప, ప్రమీల, ఆటో డ్రైవర్ అంజప్ప గాయపడ్డారు. కాగా బైకును ఢీకొన్న ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


