News August 14, 2025
TU: మొదటి రోజు పరీక్షలకు 127 మంది గైర్హాజరు

టీయూ పరిధిలో పీజీ 2, 4 సెమిస్టర్ రెగ్యులర్, బీఈడీ 2, 4 సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పీజీ, బీఈడీ కలిపి 12 పరీక్ష కేంద్రాలలో మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ అడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పీజీ పరీక్షలకు 1861 మందికి గాను 1784 మంది హాజరు కాగా 77 మంది గైర్హాజరయ్యారు. బీఈడీ పరీక్షలకు 1544 మందికి గాను 1494 మంది హాజరు కాగా 50 మంది గైర్హాజరయ్యారు.
Similar News
News March 9, 2026
VKBలో ఎండలు.. జంకుతున్న ప్రజలు

భానుడి ప్రతాపం అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక బయటికి రాని పరిస్థితి ఉన్నప్పటికీ తప్పనిసరిగా బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వారంలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వారంలో 40 డిగ్రీలు టచ్ అయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్ర హెచ్చరించింది.
News March 9, 2026
మండే ఎండలు.. ఉరుములతో వర్షాలు

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 38.9, కడపలో 38.8 డిగ్రీల గరిష్ఠ టెంపరేచర్ రికార్డయింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని IMD వెల్లడించింది.
News March 9, 2026
విజయవాడలో బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

విజయవాడలోని భవానీపురంలో ఓ బాలికపై 62 ఏళ్ల వృద్ధుడు సాంబశివరావు అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడి వేధింపులపై బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు ఆదివారం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.


