News November 7, 2025
TU: యూనివర్సిటీలో నియామకాల రద్దు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 నియామక ప్రక్రియలో నోటిఫికేషన్ నం.1/2012, 2/2012లో రోస్టర్ పాయింట్‌లు సరిగ్గా పాటించలేదని తెలంగాణ హై కోర్టు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త నోటిఫికేషన్‌లు ఇవ్వాలని యూనివర్సిటీకి సిఫార్సు చేసింది. దాదాపు 12 సం.ల అనంతరం 24 పేజీల తీర్పు వెలువరించింది. అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాసూటికల్, కెమిస్ట్రీ విభాగాలకు పాలకమండలి అనుమతి లేదని తెలిపింది.
Similar News
News January 15, 2026
గాజువాక: లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి

గాజువాక వడ్లపూడి జంక్షన్ ఆటోనగర్ వెళ్లే రహదారిలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న రాత్రి జరిగింది. వడ్లపూడిలో నివాసం ఉంటున్న చింత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుండగా కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 15, 2026
కామారెడ్డి: 4 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఇలా..

1. కామారెడ్డి(49 వార్డులు)- ST(G)-1, SC(G)-2, SC(W)-2, BC(G)-10, BC(W)-9, UR(W)-13, UR(G)- 12.
2. బాన్సువాడ(19)- ST(G)-1, SC(G)-1, SC(W)-1, BC(G)-3, BC(W)-3, UR(W)-5, UR(G)- 5.
3.ఎల్లారెడ్డి(12)- ST(G)-1, SC(G)-1, SC(W)-1, BC(G)-2, BC(W)-1, UR(W)-4 UR(G)- 2.
4.బిచ్కుంద(12)- ST(G)-1, SC(G)-1, SC(W)-1, BC(G)-2, BC(W)-1, UR(W)-4 UR(G)-2 స్థానాలు దక్కగా 4 చోట్ల ఎస్టీ మహిళలకు ఒక్కటి రిజర్వ్ కాలేదు.
News January 15, 2026
జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్‌లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్‌ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్‌తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్‌లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.


