News April 12, 2024

కవలలు.. టెన్త్, ఇంటర్‌లో సమాన మార్కులు

image

కర్ణాటకలోని హసన్‌కు చెందిన కవల అమ్మాయిలు చుక్కి, ఇబ్బనిచంద్ర తాజాగా విడుదలైన ఇంటర్(PUC) ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు. వీరికి 600 మార్కులకుగానూ 571 మార్కులు వచ్చాయి. విశేషం ఏమిటంటే రెండేళ్ల కిందట పదో తరగతి ఫలితాల్లో ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 మార్కులొచ్చాయి. ఇది పూర్తిగా యాదృచ్ఛికమని, సమాన మార్కులు ఎలా వచ్చాయో తమకే అర్థంకావడం లేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Similar News

News December 12, 2025

టీమ్ఇండియా చెత్త రికార్డ్

image

టీ20ల్లో 210+ పరుగుల ఛేదనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థి జట్లు 210+ స్కోర్లు చేయగా, అన్నింటిలోనూ భారత్ ఓడింది. నిన్న సౌతాఫ్రికా 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 162 రన్స్‌కే టీమ్ఇండియా ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 2023లో విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు IND హయ్యెస్ట్ ఛేజింగ్ స్కోర్.

News December 12, 2025

100 KGలకు పైగా బరువు పెరిగే మేకలివి

image

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి బోయర్ జాతి మేకలు. ఇవి దక్షిణాఫ్రికాకు చెందినవి. అతి వేగంగా బరువు పెరగడం, నాణ్యమైన రుచిగల మాంసం, దృఢమైన శరీర నిర్మాణం ఈ మేకల ప్రత్యేకత. ఇవి కేవలం 3 నెలల్లోనే 20 కిలోలు, ఏడాదికి 70KGలకు పైగా బరువు పెరుగుతాయి. వీటిలో మగ మేకలు గరిష్ఠంగా 110-125 కిలోలు, ఆడ మేకలు 90-100 కిలోల బరువు పెరుగుతాయి. ఈ మేకల గురించి మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 12, 2025

కలిసొచ్చిన నిబంధన తొలగింపు.. సర్పంచ్‌గా గెలుపు

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడం పలువురికి కలిసొచ్చింది. గతంలో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ఆ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో జనగామ(D) కొత్తపల్లి సర్పంచ్‌గా ముక్కెర స్వరూప రవికుమార్ ఎన్నికయ్యారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.