News August 11, 2024

వందలో ఇద్దరు ఉత్తుత్తి మన్మధులే!

image

ప్రస్తుతం ప్రతి వంద మందిలో ఇద్దరు 40 ఏళ్లు నిండకుండానే మగతనాన్ని కోల్పోతున్నారని నిపుణులు అంటున్నారు. వృత్తి, ఉద్యోగాల ఒత్తిడి, నిద్రలేమి, భోజనం వంటి సమస్యలతో టెస్టోస్టిరాన్ పనితీరు మందగించడమే దీనికి కారణం. వీటికి బీపీ, షుగర్ వంటి రోగాలు తోడవుతున్నాయి. మద్యపానం, ధూమపానం కూడా పురుషత్వానికి శత్రువులే. పురుషత్వం ప్రమాదంలో పడకూడదంటే జీవనశైలి మార్చుకోవాలి. సరిపడా నిద్ర, ధ్యానం, మంచి భోజనం తీసుకోవాలి.

Similar News

News December 7, 2025

యువతిపై లైంగిక వేధింపులు.. పోలీసులు కేసు తీసుకోలేదా..?

image

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతికి సంబంధించిన వివాదంపై పలు ప్రచారాలు సాగుతున్నాయి. యువతి తరఫున ముగ్గురు గత నెల 24, 25న స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా తీసుకోలేదని సమాచారం. దీంతో యువతి మరోదారి లేక టీసీ తీసుకుని వెళ్లిపోయిందన్న చర్చ జోరుగా నడుస్తోంది.

News December 6, 2025

నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

image

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.

News December 6, 2025

అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

image

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.