News May 22, 2024
IPL ఫైనల్ చేరే రెండు జట్లివే: ఏబీడీ

ఈ IPL సీజన్‌లో ఫైనల్ మ్యాచ్ కేకేఆర్, RCB మధ్య జరుగుతుందని దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఎక్కువగా ఉండటంతో SRH ఆటను తాను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో బెస్ట్ టీమ్ KKR అని చెప్పుకొచ్చారు. KKR ఫైనల్ వెళితే.. చెన్నై వేదికగా జరిగే ఫైనల్లో స్పిన్నర్లు ఉన్న కోల్‌కతాకే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉందన్నారు.
Similar News
News March 13, 2026
టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకోండి!

TG: టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి జరిగే పరీక్షల కోసం మొదటగా హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకోండి. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. చివరి 10 నిమిషాల్లో రాసిన జవాబులన్నింటినీ ఓసారి సరిచూసుకోండి. ALL THE BEST
News March 13, 2026
రోహిత్, కోహ్లీ కోసం BCCI స్పెషల్ ప్లాన్స్!

T20 WC విజయం తర్వాత BCCI కన్ను ఇప్పుడు 2027 ODI WCపై పడింది. రోహిత్, కోహ్లీ ODIలే ఆడుతుండగా వీరికి మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించేలా విదేశీ పర్యటనల్లో అదనపు సిరీస్‌లను చేర్చేందుకు బోర్డు సిద్ధమవుతోంది. 2011 తర్వాత దక్కని వన్డే WC సాధించాలని పట్టుదలగా ఉంది. అందుకోసం NZ, ఇంగ్లండ్ వంటి జట్లతో అదనపు మ్యాచ్‌లు ఆడుతూ ఈ ఇద్దరు దిగ్గజాలను మెగా టోర్నీకి రెడీ చేసేందుకు BCCI ప్లాన్ చేస్తోంది.
News March 13, 2026
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను ఇలా గుర్తించండి

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.


