News August 11, 2025
ఈ నెల 26న విశాఖలో రెండు యుద్ధనౌకల జలప్రవేశం

AP: ప్రాజెక్ట్ 17ఏలో తయారైన ఉదయగిరి(F35), హిమగిరి(F34) ఈ నెల 26న విశాఖలో జలప్రవేశం చేయనున్నాయి. వైజాగ్ నుంచి రెండు ప్రధాన యుద్ధ నౌకలు జలాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారని నేవీ అధికారులు తెలిపారు. ఉదయగిరిని ముంబైకి చెందిన MDL, హిమగిరిని కోల్‌కతాకు చెందిన GRSE రూపొందించాయి. వీటి రాకతో నౌకాదళం మరింత బలోపేతం కానుంది. ఉదయగిరి నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్.
Similar News
News March 15, 2026
వారికి LPG సిలిండర్లు బంద్.. కేంద్రం ప్రకటన

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయవద్దని కేంద్రం ఆదేశించింది. PNG వినియోగించుకుంటూనే డొమెస్టిక్ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే LPG కనెక్షన్లు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా LPG కనెక్షన్లూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో HYDతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో PNG సౌకర్యం ఉంది.
News March 15, 2026
గల్ఫ్ దేశాలపై దాడులు చేయొద్దు.. ఇరాన్‌ను కోరిన హమాస్!

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని తన మిత్రదేశం ఇరాన్‌ను పాలస్తీనా ఆర్మ్‌డ్ గ్రూప్ హమాస్ కోరింది. ‘పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్ సోదరులను కోరుతున్నాం. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ సోదరభావాన్ని కాపాడుకోవడానికి సహకరించాలి’ అని విజ్ఞప్తి చేసింది. US, ఇజ్రాయెల్ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని చెప్పింది. యుద్ధాన్ని ఆపేందుకు అన్ని దేశాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
News March 15, 2026
ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.


