News June 19, 2024
‘బేటీ పఢావో.. బేటీ బచావో’ రాయలేకపోయిన కేంద్ర మంత్రి

కేంద్ర శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ‘బేటీ పఢావో, బేటీ బచావో’ నినాదాన్ని హిందీలో రాయలేకపోయారు. మధ్యప్రదేశ్‌లోని బ్రహ్మకుండిలో గల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డుపై స్లోగన్‌ను సరిగ్గా రాయలేకపోయారు. అయితే, అఫిడవిట్‌లో ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై విమర్శలొస్తున్నాయి.
Similar News
News January 17, 2026
రాహుల్‌ను అవమానించానని ఫీలవుతున్నా: జగ్గారెడ్డి

TG: సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయనని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ‘గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి వచ్చి నన్ను గెలిపించాలని కోరితే ఇక్కడివారు ఓడించారు. ఆయన్ను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమోనని ఫీలవుతున్నాను. నా ఓటమికి కారణం పేదలు కాదు మేధావులు, పెద్దలే. అందుకే ఇకపై ఇక్కడ పోటీచేయదల్చుకోలేదు. నా భార్య ఇక్కడ పోటీ చేసినా ప్రచారం చేయను’ అని పార్టీ భేటీలో స్పష్టం చేశారు.
News January 17, 2026
బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..

బంగ్లాదేశ్‌లో హిందువులపై <<18840974>>దారుణాలు<<>> ఆగడం లేదు. రాజ్‌బరి జిల్లాలో రిపోన్ సాహా(30) అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపేశారు. BNP నేత అబుల్ హషేమ్ కారులో పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లబోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన రిపోన్‌పైకి కారును ఎక్కించాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, హషేమ్, కారు డ్రైవర్ కమాల్ హొసైన్‌ను అరెస్టు చేశారు.
News January 17, 2026
డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఆస్టియో పోరోసిస్ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.


