News February 10, 2025
UPDATE: అదృశ్యమైన వ్యక్తి కోసం గాలింపు

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. ఎస్ఐ శివకుమార్ వివరాలిలా.. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌కు చెందిన విఠల్ ఆదివారం ఉదయం మహమ్మద్ నగర్ నుంచి గున్కుల్ వెళ్లే దారిలో మంజీరా ప్రధాన కాలువలో చేపలు పట్టడానికి వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో గల్లంతయ్యాడు. ఘటన స్థలికి చేరుకొని నీటి విడుదలను నిలిపి వేసి, గాలింపు చర్యలు మొదలు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
మండలిలో మాటల యుద్ధం

AP: శాసనమండలిలో కూటమి, YCP సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. తిరుమల లడ్డూ అంశం, ఇందాపూర్ డెయిరీ TTDకి నెయ్యి సరఫరాపై చర్చకు YCP వాయిదా తీర్మానం ఇవ్వగా ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. పోడియం దగ్గర ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘హెరిటేజ్‌పై YCP తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆధారాలు తీసుకురమ్మంటే స్పందన లేదు’ అని మండిపడ్డారు.
News February 19, 2026
భారత్‌తో సమస్యను పరిష్కరించుకుంటాం: బంగ్లా మంత్రి

T20 WC నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న <<19153853>>సమస్యను<<>> చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అమినుల్ హక్ తెలిపారు. ‘నేను ఇండియా డిప్యూటీ కమిషనర్‌తో T20 WC ఇష్యూపై మాట్లాడా. మేం పొరుగు దేశాలతో క్రీడలతో సహా అన్ని రంగాల్లో స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటున్నాం. దౌత్యపరమైన సమస్యలపై ముందే చర్చించి ఉంటే మా జట్టు WCలో ఆడి ఉండేది’ అని హక్ పేర్కొన్నారు.
News February 19, 2026
మెదక్: విషాదం.. యువకుడి Suicide

చిలిపిచేడ్ మండలంలోని శిలాంపల్లి గ్రామంలో మన్నే సుధాకర్ (20) అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మంగళవారం గడ్డిమందు తాగగా, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. చేతికి వచ్చిన కొడుకు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు.


