News March 5, 2025

UPDATE: అవమానించడని కత్తితో దాడి

image

నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్‌లో నిన్న ఒకరిపై కత్తిపోట్లు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తనతో పాటు తన కుమారులను అవమానించాడన్న కోపంతో గాజుల్ పేట్‌కు చెందిన సంతోష్ అనే వ్యక్తిపై తన స్నేహితుడైన మహేష్ కత్తితో దాడి చేశాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపారు.

Similar News

News December 8, 2025

ప్రపంచాన్ని ఏకం చేసేలా HYDలో సమ్మిట్‌

image

HYD శివారు మీర్‌ఖాన్‌పేట్ గ్లోబల్ సమ్మిట్‌కు వేదికైంది. 44కిపైగా దేశాలు, 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలు పాల్గొననున్న ఈ సమ్మిట్‌ మ.1:30కు ప్రారంభం కానుంది. నోబెల్ గ్రహీతలు అభిజిత్, కైలాష్ సత్యర్థి ప్రధాన వక్తలు. వీరిలో 46 మంది అమెరికా ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, అమెజాన్, ఐకియా తదితర ప్రతినిధులు ఉన్నారు. అంతేకాదు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీలు, ఇతర దేశాల రాయబారులు రానున్నారు.

News December 8, 2025

చలితో ఉమ్మడి వరంగల్ గజ గజ!

image

వరంగల్‌ నగరంలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయంలో 12 డిగ్రీలు ఉంటోంది. వచ్చే మూడు రోజుల్లో కనీస ఉష్ణోగ్రతలు 10-11 డిగ్రీల వరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ములుగులో 12, భూపాలపల్లిలో 12.1, జనగామలో 12.4, మహబూబాబాద్‌లో 13, వరంగల్ జిల్లాలో 12 డిగ్రీలకు చేరింది. గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరగడంతో జనం వణికిపోతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.

News December 8, 2025

అరకు: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

image

అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ పరిధి ఉరుములులో ఎలుగుబంటి దాడిలో గిరిజనుడికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అప్పారావు గ్రామ సమీపంలోని కాఫీ తోటకి కాపలగా వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎలుగుబంట్లు పొలాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.