News February 17, 2025
UPDATE: గజ్వేల్: యాక్సిడెంట్.. గొట్టిముక్కల వాసి మృతి

గజ్వేల్ మండలం బయ్యారం స్టేజ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. కొల్గూరుకు చెందిన వెంకటేశ్, గొట్టిముక్కలకు చెందిన వెంకటేశ్(40), సాయి, నాని కారులో గజ్వేల్ నుంచి కొల్లూరు వైపు వెళ్తున్నారు. బయ్యారం చౌరస్తాలో ఎదురుగా మరో కారు కావడంతో 2 కార్లు ఢీకొన్నాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ గొట్టిముక్కలకు చెందిన వెంకటేశ్ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News March 9, 2026
BREAKING.. దండేపల్లి: విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

దండేపల్లి మండలం మేదరిపేట ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్సై తహసీద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి ఇనుప స్టాండ్‌ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్ విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యారు. మృతులు మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేటకు చెందిన నాగరాజుగా గుర్తించారు. వారు సిమెంట్ ట్రేడర్స్‌లో పని చేస్తున్నారు.
News March 9, 2026
మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి AIIMS వసతిగృహంలో డయేరియా కలకలం రేపింది. 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యమే ఈ పరిస్థితికి కారణమని అనుమానిస్తున్న అధికారులు, హాస్టల్ నుంచి 40 నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు కారణాలు వెల్లడిస్తామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
News March 9, 2026
ఆ ముగ్గురికీ T20WC ట్రోఫీ అంకితం: గంభీర్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ T20WC విజయాన్ని ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్‌లకు అంకితం ఇచ్చారు. టీమ్ గెలుపు బాటలో నడవడానికి అవసరమైన వ్యవస్థను వారు నిర్మించారని కొనియాడారు. ‘ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు స్థిరత్వాన్ని కాపాడారు. BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ లక్ష్మణ్ జాతీయ స్థాయిలో ప్రతిభను వెలికితీస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నిబద్ధత, నిజాయతీతో పనిచేస్తున్నారు’ అని పేర్కొన్నారు.


